శనివారం, 2 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2022 (15:56 IST)

రేపు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్

jagan
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తనయుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లుచేసింది. ఇందుకంసో ఆయన విజయవాడ తాడేపల్లి నుంచి మంగళవారం ఉదయం 10 గంటలకు బయలుదేరి 11 గంటలకు దర్శికి చేరుకుంటారు. అక్కడ రిసెప్షన్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. నూతన దంపతులను ఆశీర్వదించిన తర్వాత ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. సీఎం పర్యటనకు అనుగుణంగా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. 
 
కాగా, ఇటీవల వచ్చిన మాండస్ తుఫాను కారణంగా రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ తుఫాను ప్రభావంతో విస్తారంగా కురిసిన భారీ వర్షాల వల్ల చేతికొచ్చిన పంట నీటమునిగింది. ఈ రైతులను ఒక్కరంటే ఒక్కరు వైకాపా మంత్రి లేదా అధికార యంత్రాంగం లేదా సీఎం పరామర్శించలేదని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. కానీ, తమ పార్టీ నేతల వివాహాది శుభకార్యాలకు మాత్రం సీఎం వచ్చి వెళ్లడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.