ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2022 (08:53 IST)

వైకాపా ఎమ్మెల్యేలతో సీఎం జగన్ వర్క్‌షాపు

ys jaganmohan reddy
సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్క్‌షాపు నిర్వహించనున్నారు. ఇది ఈ నెల 16 లేదా 17 తేదీల్లో జరుగనుంది. ఇందులో వచ్చే ఎన్నికలపై ఫోకస్ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు వీలుగా ఈ వర్క్‌షాపును నిర్వహించనున్నారు. ఈ వర్క్ షాపుకు సంబంధించిన వివరాలను సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. 
 
రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై వైకాపా శ్రేణులను సమాయత్తం చేయడమే లక్ష్యంగా ఈ వర్క్ షాపును ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. పార్టీలోని వివిధ స్థాయిలో ఉన్న నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు.
 
పార్టీలోని ప్రతి ఒక్కరూ సమన్వయంతో నడుచుకుంటే గత ఎన్నికల మాదిరిగానే వైకాపా మరోమారు ప్రభంజనం సృష్టించడం ఖాయమని బొత్స అభిప్రాయపడ్డారు. అదేసమయంలో పార్టీ నేతలు తమ మధ్య ఉన్న అభిప్రాయభేదాలను పక్కనపెట్టి పార్టీ కోసం పని చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు.