ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2022 (14:53 IST)

ప్రధాని మోడీ సూచన మేరకు నీతి ఆయోగ్ అధికారులతో బాబు భేటీ!

chandrababu
హస్తిన పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. సోమవారం సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన జీ-20 సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో చంద్రబాబు "డిజిటల్ నాలెడ్జ్" గురించి వివరించారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చాలా నచ్చింది. ఆ వెంటనే నీతి ఆయోగ్ అధికారులతో మాట్లాడాలని బాబుకు ప్రధాని మోడీ సూచించారు. 
 
దీంతో నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్‌తో ఆయన సమావేశమయ్యారు. డిజిటల్ నాలెడ్జ్ విజన్ డాక్యుమెంట్‌కు సంబంధించిన తన అభిప్రాయాలతో కూడిన నోట్‌ను ఈ సందర్భంగా పరమేశ్వరన్‌కు చంద్రబాబు అందించారు. 
 
కాగా, ఢిల్లీలో జరిగిన సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించిన డిజిటల్ నాలెడ్జ్ అంశంపై ప్రధాని మోడీ సైతం ఆసక్తి చూపించారు. చంద్రబాబు సూచించిన అంశాన్ని తన ప్రసంగంలోనూ ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగానే ఆయన నీతి ఆయోగ్ అధికారులతో చర్చించాలని చంద్రబాబుకు సూచించారు.