గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 డిశెంబరు 2022 (10:27 IST)

వైఎస్‌ఆర్‌టీపీ, టీడీపీ వార్- టీడీపీ నేత ఇంటికి ఆఫీసుకి నిప్పు

fire
పల్నాడు జిల్లా మాచర్లలో శుక్రవారం సాయంత్రం ప్రతిపక్ష టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన “ఇదేమి కర్మ రాష్ట్రానికి” కార్యక్రమంలో భాగంగా వైఎస్‌ఆర్‌టీపీ, టీడీపీ మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్టీపీ  కార్య‌క‌ర్త‌లు టీడీపీ కార్యాల‌యం, టీడీపీ నేత బ్ర‌హ్మారెడ్డి నివాసం, వీధుల్లోని వాహనాలకు నిప్పుపెట్టార‌ని ఆరోప‌ణ‌లు వస్తున్నాయి. 
 
పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు స్థానికంగా 144 సెక్షన్‌ విధించారు. ఇదేమి కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో టీడీపీ నేతలు, పార్టీ క్యాడర్‌పై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారని తెలుస్తోంది. అనంతరం టీడీపీ కార్యాలయానికి, బ్రహ్మారెడ్డి నివాసానికి వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు నిప్పుపెట్టారు.