మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2022 (15:17 IST)

వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టులో ఊరట

anantha babu
వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వ్యక్తిగత మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆయనకు అపెక్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనకు షరతులతో కూడిన డిఫాల్ట్ బెయిన్‌ను మంజూరుచేసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఈ మేరకు సోమవారం తీర్పును వెలువరించిది. 
 
ఈ బెయిల్ కోసం అనంతబాబు గత కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాజమండ్రి కోర్టు నుంచి రాష్ట్ర హైకోర్టు వరకు బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ వాదనలు ఆలకించిన సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. 
 
మరోవైపు, అనంతబాబుకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని, పైగా, ఆయన పలుకుబడిన కలిగినవ్యక్తి అని అందువల్ల బెయిల్ ఇవ్వరాదంటూ మృతుడు సుబ్రహ్మణ్యం వేసిన పిటిషన్‌ను విచారించడానికి ధర్మాసనం నిరాకరిస్తూ, బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణనను మార్చి నెల 3వ తేదీకి వాయిదా వేసింది.