శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2022 (13:20 IST)

అర్జెంటీనా విజయం.. జాతీయ సెలవుదినం.. ఒకేచోట 10లక్షల మంది

Argentina
Argentina
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా విజయం సాధించిన సందర్భంగా నేడు జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. ఖతార్‌లో జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్, అర్జెంటీనా తలపడగా, ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనా చారిత్రాత్మక విజయం సాధించింది. అర్జెంటీనా సాధించిన ఈ విజయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 
 
ప్రపంచకప్‌తో అర్జెంటీనాకు వచ్చే ఆటగాళ్లను సన్మానించేందుకు అర్జెంటీనా కూడా సిద్ధమైంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని అర్జెంటీనా అంతటా ఈరోజు జాతీయ సెలవుదినం ప్రకటించారు. 
 
రాజధాని నగరం బ్యూనస్ ఎయిర్స్‌లో ప్రపంచకప్ విజయోత్సవాన్ని జరుపుకోవడానికి 10 లక్షల మందికి పైగా ప్రజలు అక్కడ గుమిగూడారు. దీంతో అర్జెంటీనా పండగ కళతో హోరెత్తింది.