మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2022 (11:12 IST)

FIFA వరల్డ్ కప్ 2022.. అందమైన అమ్మాయి నా చేతిలో వుంది..

FIFA World Cup 2022
FIFA World Cup 2022
FIFA వరల్డ్ కప్ 2022 ఫైనల్..  అర్జెంటీనా విజేతగా నిలిచింది. అంతటితో అర్జెంటీనా టైటిల్ గెలుచుకోవడంతో  లియోనల్ మెస్సీ చిన్ననాటి  కలను పూర్తి చేసుకున్నాడు. రికార్డు స్థాయిలో 26 ప్రపంచ కప్ ఫైనల్స్‌లో ఆడిన మెస్సీ చివరికి అర్జెంటీనా టైటిల్ గెలుచుకోవడం ద్వారా ప్రపంచ కప్‌ సాధించిన జట్టులో ఆడిన ఆటగాడిగా నిలిచాడు. 
 
రోసారియో నుండి వచ్చిన కుర్రాడు లియోనెల్ మెస్సీ, 1986లో తన దేశాన్ని టైటిల్‌ సంపాదించి పెట్టిన మారడోనాతో కలిసి ఆడాడు మెస్సీ. తాజాగా ఖతార్‌లో ఫైనల్‌లో అద్భుతంగా రాణించి.. అర్జెంటీనాకు ప్రపంచ కప్ సాధించిపెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. 
 
ఈ సందర్భంగా మెస్సీ మాట్లాడుతూ.. "ఇది ఎవరికైనా చిన్ననాటి కల.. ఈ కెరీర్‌లో అన్నీ సాధించడం నా అదృష్టం... ప్రపంచకప్ చాలా అందంగా వుంది. అందమైన అమ్మాయిలా వుండే ప్రపంచకప్‌ను నేను ఎప్పటి నుంచో కోరుకున్నాను. ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది. దీంతో కెరీర్‌ను ముగించాలని అనుకుంటున్నాను. నేను ఇకపై ఇంకేమీ అడగలేను, దేవునికి ధన్యవాదాలు, అతను నాకు ప్రతిదీ ఇచ్చాడు.. అంటూ చెప్పుకొచ్చాడు.  
 
ఖతారీ ఎడారిలో ఈ పచ్చటి పాచ్‌లో, 35 ఏళ్ల వయస్సులో అర్జెంటీనాకు ప్రపంచ కప్‌ను అందించడం అదృష్టంగా భావిస్తున్నట్లు మెస్సీ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ ఆఖరి 10 నిమిషాలలో అర్జెంటీనాను 2-0 ఆధిక్యంలోకి నడిపించిన మెస్సీ.. అదనపు-సమయంలో చివరికి షూటౌట్‌లో అతని పెనాల్టీని మార్చడం ద్వారా జట్టును గెలిపించాడు.