గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 డిశెంబరు 2022 (10:33 IST)

ఫిఫా వరల్డ్ కప్ లో మెస్సీ అదుర్స్.. ఫైనల్ లోకి అర్జెంటీనా

Messi
ఫిఫా వరల్డ్ కప్ లో మెస్సీ అదరగొట్టాడు. సెమీఫైనల్లో క్రొయేషియా పరాజయం పాలైంది. మెస్సీ అదుర్స్ ఆటతీరుతో అర్జెంటీనా ఆరవ సారి ఫైనల్లోకి ప్రవేశించింది. వివరాల్లోకి వెళితే.. ప్రపంచ కప్ టోర్నీ తొలి సెమీఫైనల్లో అర్జెంటీనా జట్టు 3-0తో గెలుపును నమోదు చేసుకుంది. మంగళవారం అర్థరాత్రి జరిగిన ఈ మ్యాచ్ లో అర్జెంటీనా అదరగొట్టింది. 
 
అర్జెంటీనా తరపున జూలియన్ అల్వారెడీ డబుల్ గోల్ చేశాడు. మెస్సీ ఒక్క గోల్ చేశాడు. ఈసారి 16వ రౌండ్ మ్యాచ్ లో జపాన్ కు, క్వార్టర్ ఫైనల్ లో పటిష్టమైన బ్రెజిల్ కు షాకిచ్చి సెమీఫైనల్లోకి ప్రవేశించిన క్రొయేషియా జట్టు ఈసారి పెద్దగా రాణించలేకపోయింది. తద్వారా క్రొయేషియా అర్జెంటీనా చేతిలో పరాజయం పాలైంది. ఇకపోతే.. బుధవారం రాత్రి ఫ్రాన్స్, మొరాకోల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్ లో అర్జెంటీనాతో తలపడనుంది.