సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2022 (16:14 IST)

హిజాబ్ ధరించలేదు.. అథ్లెట్ ఇంట్లోకి చొరబడి..?

Elnaz Rekabi
Elnaz Rekabi
హిజాబ్ లేకుండా పోటీకి దిగిన ఓ అథ్లెట్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన ఘటన ఇరాన్‌లో పెను సంచలనం రేపింది. ఇరాన్‌లో హిజాబ్ సమస్య తారాస్థాయికి చేరడంతో, ఆ దేశ మహిళలు వీధుల్లోకి చేరి ఇందుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. 
 
ఈ స్థితిలో ఇరాన్ అథ్లెట్ రెగాబీ ఇటీవల పర్వతారోహణ పోటీల్లో పాల్గొంది. హిజాబ్ ధరించకుండా పోటీలో పాల్గొన్న ఆమెకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
అలాగే హిజాబ్ ధరించకుండా పోటీకి దిగిన ఇరాన్ క్రీడాకారిణి ఇంటిని పోలీసు అధికారులు ధ్వంసం చేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.