ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 నవంబరు 2022 (09:05 IST)

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం.. అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవదహనం

fire accident
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ఇంటిలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవదహనమయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లా మేడంనగర్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. 
 
పోలీసులు కథనం మేరకు.. ఒక భవనంలో నివసిస్తున్న ఒక కుటుంబం వారు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మంటల్లో చిక్కుకున్నారు. అగ్నిప్రమాదంలో నలుగురు చిన్నారులు సహా ఆరుగురు సజీవదహనమైనట్లు సమాచారం.
 
అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని అనుమానిస్తున్నారు. పక్కనే ఉన్న ఫర్నీచర్ దుకాణానికి కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.