గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 నవంబరు 2022 (11:00 IST)

ప్రియురాలికి వీడియో కాల్.. లైవ్‌లో భార్యను అలా చేసిన భర్త.. ఎక్కడ?

woman
ఆగ్రా మహిళ తన భర్తను హనీ ట్రాప్ చేసిందని ఆరోపిస్తూ కేసు నమోదైంది. ప్రియురాలు తన ప్రియుడిని హనీట్రాప్ చేసింది. అతడి ఇంట్లో భార్యను కొట్టమంది. దాన్ని వీడియోలో చూసి ఆనందించింది. ఆపై హనీట్రాప్ మొదలెట్టింది. వివరాల్లోకి వెళితే.. తన భర్త రాబిన్‌తో పదేళ్ల క్రితం తనకు వివాహం అయ్యిందని బాధితురాలు తెలిపింది. 
 
అయితే తన భర్త వేరొక మహిళతో ప్రేమాయణం సాగిస్తున్నాడని.. అలాగే సహజీవనం చేస్తున్నాడని వెల్లడించింది. యూపీ హరిపర్వత్ ప్రాంతంలో వాళ్లు హాయిగా సంసారం చేస్తున్నారని తెలిపింది. కానీ సదరు మహిళ హనీట్రాప్‌కు పాల్పడిందని.. డబ్బు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేసిందని తెలిపింది. 
 
అంతేగాకుండా తన భర్త కుటుంబాన్ని పట్టించుకోలేదని.. తన కుమార్తెలను చదువుకు, ఇంటి ఖర్చులకు ఏమీ ఇవ్వట్లేదని తెలిపింది. ఒకవేళ ఇంటికి వచ్చినా.. తన భర్త తమ పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాడని.. ప్రియురాలికి వీడియో కాల్ చేసి.. తమను కొట్టడం చేస్తున్నాడని ఫైర్ అయ్యింది. 
 
వీడియో కాల్ లైవ్‌గా తన భర్త తమను హింసించడం చూసి ఆనందిస్తోందని తెలిపింది. అలాగే తన భర్త రాబిన్‌ను అడ్డు పెట్టుకుని హనీ ట్రాప్ చేస్తోందని.. దీనిపై కేసు నమోదు చేయాలని పోలీసులను విజ్ఞప్తి చేసింది. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.