శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 నవంబరు 2022 (20:38 IST)

భార్యకు హెచ్ఐవీ.. విడాకులు కోరిన భర్త.. తిరస్కరించిన హైకోర్టు

భార్యకు హెచ్ఐవీ వుందని భర్త విడాకులు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే బాంబే హైకోర్టు అతని అభ్యర్థనను తిరస్కరించింది. ఆమెకు హెచ్ఐవీ సోకినట్లు నిర్ధారించే ఎలాంటి సాక్ష్యాధారాలను సమర్పించలేదని పేర్కొంది. దీంతో అతని అభ్యర్థనను తిరస్కరించింది. 
 
వివరాల్లోకి వెళితే.. పూణేకు చెందిన దంపతులకు 2003లో వివాహమైంది. అయితే భార్యకు ప్రాణాంతక వైరస్ హెచ్ఐవీ సోకింది. దీంతో మానసిక క్షోభకు గురవుతున్నానని .. ఇకపై కలిసి జీవించలేమని.. విడాకులు కావాలని భర్త బాంబే కోర్టును ఆశ్రయించాడు.
 
భార్య విచిత్రంగా ప్రవర్తిస్తోందని.. మొండి స్వభావం గల వ్యక్తి. ఆమె వ్యాధులతో బాధపడిందని.. 2005లో ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలిందని విడాకుల పిటిషన్‌లో పేర్కొన్నాడు. 
 
అయితే వైద్య పరీక్షల్లో నెగటివ్‌గా వచ్చినా భర్త.. ఆయన కుటుంబ సభ్యులు తమపై తప్పుడు ప్రచారం చేస్తుందని బాధితురాలు వాపోయింది. అయితే ఈ వాదనలను కోర్టు ఖండించింది. సరైన ఆధారాలు లేవని.. హైకోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది.