శుక్రవారం, 1 మార్చి 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 నవంబరు 2022 (11:38 IST)

ఫిఫా ప్రపంచ కప్‌: జర్మనీపై జపాన్ అద్భుతమైన విజయం

German
German
ఫిఫా ప్రపంచ కప్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా ఓడిపోయింది. అది కూడా పసికూన సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా ఓడిపోవడం సంచలనానికి తెరతీసింది. అలాగే గురువారం జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో జపాన్ అద్భుత విజయం సాధించింది. 
 
ఈ మ్యాచ్‌ రసవత్తరంగా సాగింది. నువ్వానేనా అన్నట్లు ఇరు జట్లు తలపడ్డాయి. తొలి అర్థ భాగం ముగిసే సరికి జర్మనీ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే, ఆ తర్వాత జపాన్ ఆటగాళ్లు విజృంభించారు. 
 
సెకన్లలోనే రెండు గోల్స్ సాధించారు. ఆపై జర్మనీని నిలువరించారు. ఫలితంగా మ్యాచ్ ముగిసే సరికి 2-1తో జపాన్ విజయం సాధించి సంచలనం నమోదు చేసింది.
 
మరోవైపు, డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 4-1తో విజయం సాధించింది. ఇంకా మొరాకో-క్రొయేషియా మధ్య జరిగిన మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది.