గురువారం, 23 మార్చి 2023
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated: ఆదివారం, 20 నవంబరు 2022 (09:59 IST)

నేటి నుంచి దుబాయ్ వేదికగా ఫిఫా సాకర్ వరల్డ్ కప్

fifa world cup
దుబాయ్ వేదికగా ఫిఫా సాకర్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబరు 18వ తేదీ వరకు ఈ మ్యాచ్‌‍లు జరుగుతాయి. ఈ మెగా సాకర్ పోటీలకు యూఏఈ దేశాల్లో ఒకటైన ఖతార్ ఆతిథ్యమిస్తుంది. ఈ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో ఆీతిథ్య ఖతార్, ఈక్వెడార్ జట్లు తలపడతాయి. 
 
ఈ టోర్నీలో మొత్తం 32 జట్లు పాల్గొంటున్నాయి. ఒక్కో గ్రూపులో 4 జట్లు చొప్పున మొత్తం 8 గ్రూపులుగా విభజించారు. ఈ మ్యాచ్‍‌లను భారత్‌లో స్పోర్ట్స్ 18 చానెల్ ప్రసారం చేస్తుంది. 
 
కాగా, తొలి మ్యాచ్‌కు ముందు భారీ స్థాయిలో ప్రారంభోత్సవ వేడుకలను నిర్వహిస్తారు. ఓపెనింగ్ వేడుకల్లో ప్రముఖ సంగీత బృందం బీటీఎస్‌కు చెందిన జంగ్ కూక్ ప్రదర్శన ఉంటుంది. ఈ ప్రారంభ వేడుకలకు దోహా సమీపంలోని బేత్ స్టేడియం వేదికకానుంది.