సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 10 నవంబరు 2022 (15:25 IST)

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ : ఇంగ్లండ్ విజయలక్ష్యం 169

hardik pandya
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, గురువారం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. దీంతో ప్రత్యర్థి ఇంగ్లండ్ ముంగిట 169 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. భారత ఆటగాళ్ళలో ఓపెనర్లు కేఎల్ రాహల్ 5, రోహిత్ శర్మ 27, కోహ్లీ 50, సూర్యకుమార్ యాదవ్ 14, హార్దిక్ పాండ్యా 63, రిషభ్ పంత్ 6 చొప్పున పరుగులు చేశారు. 
 
నిజానికి భారత్ ఓపెనర్లిద్దరినీ 8.5 ఓవర్లలోనే కోల్పోయింది. జట్టు స్కోరు 9 పరుగుల వద్ద ఉండగా, రాహుల్, ఆ తర్వాత 56 పరుగుల వద్ద రోహిత్ శర్మలు ఔట్ అయ్యార్. ఈ క్రమంలో ఎన్నో ఆశలుపెట్టుకున్న సూర్య కుమార్ యాదవ్ కూడా కేవలం 14 పరుగులే చేసి తీవ్ర నిరాశకు లోను చేశారు. ఈ క్రమంలో విరాటో కోహ్లీతో జతకలిసిన హార్దిక్ పాండ్యా జట్టు ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 
 
వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త వహించారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు అర్థ సెంచరీలు పూర్తి చేశారు. ఓవరాల్‌గా భారత్ ఇన్నింగ్స్‌లో కోహ్లీ, హార్డిక్ పాండ్యలు జట్టును ఆదుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్ట్, రషీద్‌లు ఒక్కో వికెట్ తీయగా, క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు తీసి భారత్ ఇన్నింగ్స్‌ దెబ్బతీశాడు.