శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 10 నవంబరు 2022 (10:08 IST)

ఇంగ్లండ్‌పై గెలుపు అంత సులువేమి కాదు : హర్భజన్ సింగ్

harbhajan singh
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా గురువారం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య కీలకమైన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొనివుంది. దీనికి కారణం ఇప్పటికే తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంది. దీంతో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలిచి, ఫైనల్‌లో పాకిస్థాన్‌తో తలపడాలన్నది కోట్లాది మంది క్రికెట్ అభిమానుల బలమైన ఆకాంక్షగా ఉంది. 
 
ఈ పరిస్థితుల్లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారన్న అంశంపై పలువురు మాజీ క్రికెటర్లు తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా స్పందించారు. ఇంగ్లండ్‌పై విజయం అంత సులువేమీ కాదన్నారు. అయితే, ప్రతి భారతీయుడితో పాటు తాను కూడా రేపటి సెమీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి భారత్ ఫైనల్‍‌కు చేరాలని కోరుంటున్నానని తెలిపాడు. 
 
"గురువారం మన మ్యాచ్ ఉంది. ఇంగ్లండ్‌‍తో సెమీస్ మ్యాచ్ కఠినంగానే ఉంటుంది. అయితే, ఏం జరుగుతుందో చూడాలి. దేశమంతా భారత్ గెలవాలని కోరుకుంటుంది" అని భజ్జీ వ్యాఖ్యానించారు.