గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 10 నవంబరు 2022 (08:28 IST)

ట్వంటీ20 వరల్డ్ కప్ : భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ జరగకుండా చూస్తాం : ఇంగ్లండ్ కెప్టెన్

jose buttler
ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల పోరు జరగకుండా చూస్తామని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నారు. ఇందుకోసం తమ వంతు ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ టోర్నీలో భాగంగా, గురువారం భారత్ ఇంగ్లండ్ జట్ల రెండో సమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే పాకిస్థాన్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఈ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ ఫలితంపై ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ స్పందించారు. 
 
ఈ పొట్టి ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడకుండా మా వంతు ప్రయత్నం చేస్తాం. భారత్‌తో తీవ్రంగా పోరాటం చేస్తాం. ఇపుడు భారత్ చాలా పటిష్టంగా ఉంది. చాలా రోజులుగా నిలకడగా రాణిస్తోంది. లోతైన బ్యాటింగ్, బౌలింగ్, విభాగాతలో ఉన్న జట్టు భారత్‌ను అడ్డుకోవడానికి శ్రమించాల్సివుంది. ఇక సూర్యకుమార్ టాలెంట్ అద్భుతం. 
 
ఇప్పటివరకు టోర్నీల్లో వైవిధ్యంగా ఆడుతున్న బ్యాటర్లలో అతడే టాపర్. స్వేచ్ఛగా షాట్లు కొట్టడమే సూర్యకుమార్ అసలైన బలం. అయితే, ఎలాంటి బ్యాటర్ అయినా సరే వికెట్‌గా మారేందుకు అవకాశం ఉంది" అని చెప్పారు. కాగా, ఈ ఫైనల్ పోరు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరగాలి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న వేళ ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.