గురువారం, 9 ఫిబ్రవరి 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated: గురువారం, 10 నవంబరు 2022 (13:45 IST)

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : టాస్ నెగ్గిన ఇంగ్లండ్.. భారత్ వికెట్ డౌన్

kl rahul
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుని, ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో ఓపెనర్లుగా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే, ఓపెనర్ కేఎల్ రాహుల్ (5) రెండో ఓవర్‌లో వోక్స్‌ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వనుదిరిగాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు క్రీజ్‌లో ఉన్నారు. 
 
ఈ మ్యాచ్ కోసం బరిలోకి దిగిన జట్ల వివరాు
భారత్ : రాహుల్, రోహిత్, కోహ్లీ, సూర్యకుమార్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అశ్విన్, భువనేశ్వర్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్
 
ఇంగ్లండ్ : జోస్ బట్లర్, హాల్స్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, అలీ, శ్యామ్ కరన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, అదిల్ రషీద్