ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 11 నవంబరు 2022 (13:44 IST)

మా కల సాకారం కాకుండా భారమైన హృదయంతో.. విరాట్ కోహ్లీ ట్వీట్

virat kohli
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఇంగ్లండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. భారత్ నిర్ధేశించిన 168 పరుగుల విజయలక్ష్యాన్ని ఇంగ్లండ్ ఓపెనర్లు బట్లర్, హేల్స్‌లో ఊదేశారు. ఈ ఓటమిపై భారత జట్టుపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఈ ఓటమితో భారత్ స్వదేశానికి పయనమైంది. దీనిపై విరాట్ కోహ్లీ చేసిన ఓ ట్వీట్ ఇపుడు వైరల్ అయింది.
team india
 
"మా కల సాధించకుండా తీవ్ర నిరాశతో నిండిన హృదయంతో ఆస్ట్రేలియా తీరాలను వదలివెళుతున్నాం. కానీ ఓ జట్టుగా చాలా చిరస్మరణీయమైన క్షణాలను తిరిగి తీసుకెళ్తున్నాం. ఇక్కడి నుంచి మరింత మెరుగవ్వాలన్నదే మా లక్ష్యం. మైదానంలో మాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్క అభిమానికీ కృతజ్ఞతలు. ఈ జెర్సీని ధరించి మన దేశానికి ప్రాతినిత్యం వహించడం ఎల్లవేళలా గర్వంగా భావిస్తున్నా" అంటూ పేర్కొన్నారు.