గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

రోహిత్ శర్మ అభిమానికి రూ.6.5 లక్షల అపరాధం.. ఎందుకో తెలుసా?

rohit sharma fan
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలు ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్నాయి. ఇప్పటికే లీగ్ మ్యాచ్‌లన్నీ ముగియగా, వచ్చే బుధవారం నుంచి సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. అయితే, ఆదివారం భారత్, జింబాబ్వే జట్ల మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరిగింది. 
 
ఈ మ్యాచ్ జరుగుతుండగా, ఓ క్రికెట్ వీరాభిమాని భారత కెప్టెన్ రోహిత్ శర్మను చూసేందుకు వచ్చాడు. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. దీన్ని గమనించిన భద్రతా సిబ్బంది అతడి వెనుక నుంచి పరుగులుల తీసి మరీ పట్టుకున్నారు. ఈ క్రమంలో రోహిత్‌ను చూడగానే ఆ అభిమాని ఉద్వోగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. 
 
దీన్ని గమనించిన రోహిత్ ఆ అభిమాని వద్దకు పరుగుత్తి మాట్లాడేందుకు ప్రయత్నించగా, సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఆ అభిమానిని బలవంతగా అక్కడ నుంచి బయటకు తీసుకెళ్లారు. కాగా, మైదానంలో ఆటకు అంతరాయం కలిగించినందుకు ఆ అభిమానికి రూ.6.5 లక్షల అపరాధం విధించారు.