గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 14 నవంబరు 2022 (18:02 IST)

కార్తి నటిస్తున్న జపాన్ ఫస్ట్ లుక్

Karthi's Japan  look
Karthi's Japan look
హీరో కార్తి కథానాయకుడిగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'జపాన్'. రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. కార్తికి ఇది 25వ సినిమా.
 
 తాజాగా 'జపాన్' ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు నిర్మాతలు. టైటిల్ కి తగ్గట్టే ఫస్ట్ లుక్ చాలా క్రేజీ గా వుంది. ఫస్ట్ లుక్ లో కార్తీ చేతిలో బాటిల్ పట్టుకొని, రెడ్ జంప్‌సూట్‌లో సోఫాలో నిద్రపోతున్నట్లు కనిపించారు. కార్తి ఎదురుగా మందు గ్లాస్ తో సేదతీరున్న ఓ అమ్మాయి కూడా గమనించవచ్చు. ఇక సోఫా వెనుక గోడపై పెద్ద గోల్డెన్ ఫ్రేమ్ లో మరొక డిఫరెంట్ గెటప్ లో కనిపించారు కార్తి. బంగారు చొక్కా, మెడలో గొలుసులను ధరించి, ఒక చేతిలో బంగారు తుపాకీని మరో చేతిలో గోల్డెన్ గ్లోబ్ ని పట్టుకున్నట్లుగా కనిపించడం క్యూరియాసిటీని పెంచింది.
 
ఈ చిత్రంలో తొలిసారిగా కార్తి సరసన అను ఇమ్మాన్యుయేల్‌ జోడి కడుతోంది. అల్లు అర్జున్ 'పుష్ప'లో 'మంగళం శీను' పాత్రలో ఆకట్టుకున్న సునీల్ 'జపాన్'లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సునీల్ తమిళ్ లో అరంగేట్రం చేస్తుండటం మరో విశేషం.
 
ఈ చిత్రానికి  జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి డీవోపీగా పని చేస్తున్నారు. మానగరం, ఖైదీ, తానక్కరన్, విక్రమ్ వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్న ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా,  నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ (కమ్మరసంభవం) వినేష్ బంగ్లాన్ 'జపాన్' ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.
తారాగణం: కార్తి, అను ఇమ్మాన్యుయేల్‌, సునీల్, విజయ్ మిల్టన్ తదితరులు