గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 నవంబరు 2022 (16:46 IST)

నా భార్యవి అవుతావా?.. ఇన్‌స్టాలో బాలుడి పోస్టు.. ఆపై?

మహారాష్ట్రలోని పూణేలో ఓ బాలుడు పోక్సో చట్టం కింద అరెస్టయ్యాడు. ఇందుకు కారణం ఇన్‌స్టాను అతడు దుర్వినియోగం చేయడమే. వివరాల్లోకి వెళితే.. పూణేలో ఓ 14 ఏళ్ల విద్యార్థి.. అదే పాఠశాలలో చదువుతున్న 13 ఏళ్ల బాలికను ప్రేమించాల్సిందిగా వెంటబడ్డాడు. తనతో స్నేహం చేయకపోతే కిడ్నాప్ చేస్తానని బెదిరించాడు. 
 
అయితే బాలిక ఆ బెదిరింపులను లెక్కచేయకపోవడంతో ఆమెపై కోపాన్ని పెంచుకున్నాడు. అంతటితో ఆగకుండా బాలిక ఫోటో తీసి ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఇంకా "నువ్వు నా భార్యవి అవుతావా?" అని రాసుకొచ్చాడు. 
 
అది చూసిన బాలిక తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడిని అరెస్ట్ చేసారు.