గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2022 (09:01 IST)

ఫిఫా వరల్డ్ కప్ విజేత అర్జెంటీనాకు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

Argentina
ఖతార్ ఆతిథ్యమిచ్చిన ఫిఫా వరల్డ్ కప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఫైనల్ పోటీలో అర్జెంటీనా, ఫ్రాన్స్ దేశాలు తలపడ్డాయి. చివరి క్షణం వరకు మునివేళ్లపై నిలబెట్టిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు విజయభేరీ మోగించింది. నరాలు తెగే ఉత్కంఠతో ఈ సాగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో 4-2 పెనాల్టీ షూటౌట్ ద్వారా అర్జెంటీనా జట్టు జయభేరీ మోగించింది. తద్వారా మెస్సీ కల నెరవేరింది. అర్జెంటీనా ఖాతాలో మూడో వరల్డ్ కప్ వచ్చి చేరింది.
 
వరల్డ్ కప్ చరిత్రలో అర్జెంటీనాకు ఇది మూడో టైటిల్. ఆ జట్టు గతంలో 1978, 1986 సంవత్సారల్లో జరిగిన పోటీల్లో విజేతగా నిలిచింది. ఇక వరల్డ్ కప్ గెలిచి కెరీర్‌కు వీడ్కోలు పలకాలన్న మెస్సీ కల ఘనంగా నెరవేరింది. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన అర్జెంటీనాకు 347 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇచ్చారు. అలాగే, రెండో స్థానంలో నిలిచిన ఫ్రాన్స్‌కు రూ.248 కోట్లు, మూడో స్థానంలో నిలిచిన క్రొయేషియాకు రూ.233 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన మొరాకోకు రూ.206 కోట్లు చొప్పున ఈ ప్రైజ్ మనీని అందజేశారు.