శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 డిశెంబరు 2022 (10:45 IST)

ఫిఫా 2022: బుర్ఖాలో మొరాకో ఫుట్ బాల్ క్రీడాకారిణి తల్లి-బికినీలో భార్య

Achraf Hakimi
Achraf Hakimi
ఫిఫా వరల్డ్ కప్ 2022లో సెమీఫైనల్ కు అర్హత సాధించిన తొలి ఆఫ్రికా దేశంగా మొరాకో చరిత్ర సృష్టించింది. 24 ఏళ్ల అచ్రాఫ్ హకీమి ఐదు మ్యాచ్ లు ఆడి ఒక గోల్ సాధించగా, చివరి 16 మ్యాచ్ లో స్పెయిన్ పై షూటౌట్ విజయంలో పెనాల్టీ గోల్ సాధించాడు.
 
మ్యాచ్ గెలిచిన తరువాత, అతను ప్రేక్షకులలో ఉన్న తన తల్లి వద్దకు వెళ్లి ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. క్రిస్టియానో రొనాల్డో జట్టు పోర్చుగల్ (మొరాకోను ఓడించిన పోర్చుగల్) విజయం తరువాత, ఈ ఫుట్ బాల్ క్రీడాకారుడి స్పానిష్ నటి భార్య హిబా అబూక్ (అచ్రాఫ్ హకీమి భార్య) బికీనీలో కనిపించింది. ఈ ఫోటోలను బంగ్లాదేశ్ రచయిత తస్లీమా నస్రీన్ ట్వీట్ చేసింది.  
 
తస్లీమా నస్రీన్ వంటి పలువురు సోషల్ మీడియా కార్యకర్తలు హకీమి భార్య బికినీ డ్రెస్సింగ్ శైలి గురించి సమస్యను లేవనెత్తిన తరువాత హిబా అబూక్ వెలుగులోకి వచ్చింది.  మొరాకో స్టార్ ఫుట్ బాల్ క్రీడాకారుడు అచ్రాఫ్ హకీమి, అతని భార్య హిబా అబూక్ ఫొటోలను తస్లీమా నస్రీన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. వీరు ముస్లింలు.. అయితే వారు బురఖా లేదా హిజాబ్ ధరించరు.
 
మొరాకో ఫుట్ బాల్ క్రీడాకారుడు అచ్రాఫ్ హకీమి భార్య హిబా అబూక్ ట్యునీషియా-స్పానిష్ నటి, ఆమె టీవీ సీరిస్ ఎల్ ప్రిన్సిప్ లోని పాత్రల్లో కనిపించింది. ఇటీవల, ఈ జంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో ఇద్దరూ బోల్డ్ లుక్ లో కనిపించారు, కొంతమంది వారి ఫ్యాషన్ స్టేట్ మెంట్ దుస్తులను ప్రశంసించారు. కొంతమంది ఈ లుక్ ను ఇష్టపడలేదు.