ఆదివారం, 14 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 13 జనవరి 2023 (18:38 IST)

నేటితో నాని దసరా షూటింగ్ పూర్తి

Nani, Keerthy Suresh
Nani, Keerthy Suresh
నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం 'దసరా' మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ మెటీరియల్‌కి మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా ధూమ్ ధామ్ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి కావడంతో చిత్రబృందం ప్రమోషన్స్ ని దూకుడుగా చేస్తోంది.
 
ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలో తన లుక్‌ అందరినీ ఆశ్చర్యపరిచింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.  
 
సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక  పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు. దసరా చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో  విడుదల కానుంది.