సంబంధిత వార్తలు
- ఏడాదికి వీడ్కోలుగా ది కిల్లర్ స్మైల్ విత్ ఎ కిల్లింగ్ లుక్ తో నాని
- వారాహి వాహనంపై వైకాపా విమర్శలు.. పసుపు రంగు వేసుకోవాలంటూ ఎద్దేవా
- నేను మ్యాజిక్‌ని నమ్ముతాను : నాని
- మీనాక్షి గ్లామర్‌తో వైలెన్స్‌ను బ్యాలెన్స్ చేసింది... హీరో నాని
- నా సినిమాకు నేనే లేట్‌గా వెళ్లా.. ఫస్ట్ కాల్ ఆ హీరో నుంచి వచ్చింది.. అడివి శేష్
నాని దసరా క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభం
nani posted still
సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ గోదావరిఖని బొగ్గుగని సెట్‌లో ఈ రోజు ప్రారంభమైంది. పదిహేను రోజుల షెడ్యూల్ లో కీలకమైన క్లైమాక్స్ సీక్వెన్స్ చిత్రీకరించ నున్నారు. దీన్ని అప్‌డేట్ చేస్తూ నాని ఇన్‌స్టాగ్రామ్ లో లొకేషన్ ఫోటో ని పోస్ట్ చేసి "చివరి షెడ్యూల్ లో మొదటి రోజు. మనస్సు, శరీరం, హృదయం, ఆవేశం దాని పూర్తి సామర్థ్యంతో" అని రాశారు.
ఇది సినిమాలో అత్యంత కీలకమైన సీక్వెన్స్, సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. ఈ షెడ్యూల్ తర్వాత, ఒక పాట మాత్రమే షూట్ చేయడానికి మిగిలి ఉంది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. జాతీయ అవార్డు విన్నర్ కీర్తి సురేష్ ఈ సినిమాలో నానికి జోడిగా కనిపించనుంది.
సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
