శనివారం, 9 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 25 జనవరి 2023 (18:41 IST)

శాకుంతలంలో చిన్నయి, సిద్‌ శ్రీరామ్‌ ఆలపించిన రుషివనంలో సాంగ్‌ విడుదలైంది

Samantha, Dev Mohan
Samantha, Dev Mohan
శాకుంతలం చిత్రంలోని శాకుంతల, దుష్యంత్‌లు ప్రణయ గీతం కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని ఈగీతంలో వేటకోసం అడవికి దుష్యంత్‌డు రావడం, శాకుంతల కనిపించడం ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడడం వంటి సన్నివేశాలు ఇందులో కనిపించాయి. సందర్భానుసారంగా శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. ‘రుషివనంలోనే స్వర్గధామం, హిమ వనంలోనా అగివర్షం. ప్రణయ కావ్యానా వనం సాక్ష్యం..’ అంటూ వీరి ప్రణయానికి అడవీ సాక్ష్యం అంటూ సాగిన ఈ పాట చిన్నయి శ్రీపాద, సిద్‌ శ్రీరామ్‌ గాత్రంతో సరికొత్త హంగులు దిద్దుకుంది.
 
మణిశర్మ సంగీత సారధ్యంలో రూపొందింది. నిర్మాత నీలిమగుణ. గుణశేఖర్‌ దర్శకత్వం వహించారు. దిల్‌ రాజు సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా బేనర్‌లో ఎన్నో ప్రేమకథలు వచ్చాయి. పురాణాలకు చెందిన ఈ శాకుంతలం దృశ్యకావ్యంగా దర్శకుడు తీర్చిదిద్దారు. ఇటువంటి సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా వుంది. పాత్రలపరంగా సమంత,  దేవ్‌ మోహన్‌ చక్కగా అమరారు అని తెలిపారు.