సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 జూన్ 2022 (09:00 IST)

కండిషన్లు పెడుతున్న నయనతార.. అలాంటి సీన్స్ వుంటే చేయను?

nayanatara_vignesh
దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతార పెళ్లికి తర్వాత దర్శకనిర్మాతలకు కండిషన్స్ పెడుతుందట. ప్రియుడు విక్కీని పెళ్లి చేసుకున్న నయన, పెళ్లి తర్వాత తాను ఎలాంటి గ్లామర్ రొమాంటిక్ సీన్లలో నటించనని నిర్మాతలకు కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. 
 
మొదటి ప్రాధాన్యత కేవలం లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు మాత్రమే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పాత్రని బట్టి రొమాన్స్ లేకుండా కమర్షియల్ చిత్రాలకు ఒకే చెప్పనుందట.
 
అది కూడా ఇకపై ఈమె బల్క్ అమౌంట్‌లో కాల్షీట్స్ ఇవ్వదట. ఇలా నయనతార సినిమాలో నటించాలంటే ఇలా కొత్త కండిషన్ లను పెట్టినట్టు తెలుస్తోంది. 
 
అయితే ఒక సినిమా పూర్తి అయిన తర్వాతనే తాను మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అలా అయితేనే తన కుటుంబంతో కలిసి సమయం గడపటానికి వీలు ఉంటుందని నయనతార పలు ప్రణాళికలు వేసుకున్నట్లు తెలుస్తోంది.