మంగళవారం, 31 జనవరి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated: శనివారం, 11 జూన్ 2022 (17:33 IST)

విఘ్నేశ్ శివన్‌తో నయనతార పెళ్లి.. నయన్ కనబడితే కొడతానంటున్న ప్రభుదేవా భార్య!

Nayanatara
దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో నయనతార వివాహం మహాబలిపురంలోని గ్రాండ్ షెరటాన్ హోటల్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. విఘ్నేష్‌తో ప్రేమలో పడకముందు నయనతార ప్రభుదేవాను ప్రేమించింది.

ఈ క్రమంలోనే ఆమెను పెళ్లి చేసుకునేందుకు ప్రభుదేవా తన భార్య రామాలతకు విడాకులు కూడా ఇచ్చాడు. ఈ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ.. పీటల వరకు వచ్చిన వారి పెళ్లి ఆగిపోయింది.
 
ఈ నేపథ్యంలో ప్రభుదేవా భార్య రామాలత.. నయనతార గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన భర్త ప్రభుదేవాతో ప్రేమను నటించి తన కాపురంలో నిప్పులు పోసిందని ఆరోపించింది. తన బతుకు రోడ్డున పడేందుకు కారణం నయనతార అని.. తన భర్తను తనకు దూరం చేసిందని ఆరోపించింది.  
 
తన భర్త తనను దేవతలా చూసుకునేవాడని.. ఆమె మాయలో పడి తనకు విడాకులు ఇచ్చాడని ఆరోపణలు చేసింది. నయన ను ఏ దేవుడు క్షమించడని.. నయనతార తనకు కనిపిస్తే మాత్రం కచ్చితంగా కొడతానని రామాలత శాపనార్థాలు పెట్టింది. 
 
నయనతార పెళ్లి నేపథ్యంలో రామాలత చేసిన వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు పెడుతూ తమ పని తాము చేస్తున్నారు.