శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 జూన్ 2022 (10:10 IST)

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్

asaduddin owaisi
సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజాశాంతికి విఘాతం కలిగించేలా, ప్రజల మధ్య విద్వేషాలు చెలరేగాలా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే, బీజేపీ బహిష్కృత నేతలు నుపూర్ శర్మ, నవీన్ జిందాల్‌తో పాటు మొత్తం 30 మందిపై ఈ కేసులు నమోదు చేశారు. 
 
వివాదాస్పద మతపెద్ద స్వామి యతి నర్సింగానంద్, బీజేపీ మాజీ అధికారప్రతినిధి నుపుర్ శర్మ, ఢిల్లీ బీజేపీ మాజీ చీఫ్ నవీన్ జిందాల్‌తో సహా మొత్తం 31 మంది పేర్లను పోలీసులు చేర్చారు. ఇందులో ఢిల్లీకి చెందిన జర్నలిస్టు సవా సఖీలు కూడా ఉన్నారు. 
 
వీరిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 153 (అంతరాయం కలిగించే ఉద్దేశ్యంతో రెచ్చగొట్టడం) 295 (ఏదైనా వర్గానికి చెందిన మతాన్ని కించపరిచే ఉద్దేశ్యంతో ప్రార్థనా స్థలంపై దాడి చేయడం లేదా అపవిత్రం చేయడం), 505 (ప్రజా దురాచారానికి అనుకూలమైన ప్రకటనలు) కింద కేసులు నమోదు చేయబడ్డాయి.