డీప్ ఫేక్‌లపై ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ సజ్జనార్ ప్రత్యేక దృష్టి... ఇక వారికి చుక్కలేనా?  
                                       
                  
				  				  
				   
                  				  సోషల్ మీడియాలో డీప్ ఫేక్‌లు మరింతగా పెరిగిపోతున్నాయి. నానాటికీ అందుబాటులోకి వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కారణంగా డీప్ ఫేక్‌లు ఇష్టారాజ్యంగా సృష్టిస్తున్నారు. ఈ డీప్ ఫేక్ బాధితుల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ బాధితుడే కావడం గమనార్హం. దీంతో ఈ విషయాన్ని ఆయన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం ఇపుడు ఈ అంశంపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టిసారించనున్నారు. 
				  											
																													
									  
	 
	ఇదే విషయంపై శుక్రవారం హైదరాబాద్ నగరంలో జరిగిన 2కే రన్‌లో చిరంజీవి పోలీసులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డీపే ఫేక్ టెక్నాలజీ సమాజానికి ఒక పెద్ద గొడ్డలిపెట్టుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తాను కూడా డీరప్ ఫేక్ బారిన పడ్డానని, కొందరు తన ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు సృష్టించారని ఆయన వెల్లడించారు. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు తక్షణమే ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని, లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
				  
	 
	ఈ కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పైగా, ఈ డీప్ ఫేక్ అంశాన్ని వీసీ సజ్జనార్ ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం ఆయన ఒక ప్రత్యేక విభాగాన్ని సైతం ఇప్పటికే ఏర్పాటుచేశారు. దీంతో డీప్ ఫేక్ క్రియేటర్లకు ఇక కష్టాలు తప్పవని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.