బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (10:36 IST)

కిరణ్ అబ్బవరానికి మరో హిట్ పడినట్టేనా.?

Kiran Abbavaram
Kiran Abbavaram
రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం అతి తక్కువకాలంలోనే మంచి గుర్తింపు సాధించుకున్నాడు. రీసెంట్ గా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు కిరణ్ అబ్బవరం. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై  స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు  ఈ సినిమాను నిర్మించారు.
 
భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో ఈ సినిమా రావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.ప్రస్తుతం ఈ సినిమా మంచి కలక్షన్స్ తో దూసుకుపోతుంది. 
  
నెంబర్ నైబరింగ్ కాన్సప్ట్ తో వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల   ప్రేక్షకులను అలరిస్తుంది.  మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న  థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు 2.75 కోట్ల గ్రాస్ ను,  రెండవరోజు 2.40 కోట్ల గ్రాస్ ను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 5.15 కోట్ల గ్రాస్ ను సాధించి ఈ చిత్రం ద్విగిజయంగా ముందుకు సాగుతుంది. 
 
ఈ సినిమాతో  మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడుగా పరిచయమయ్యారు. కిరణ్ సరసన కశ్మీర పరదేశి ఈ సినిమాలో నటించింది. GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా, అల్లు అరవింద్ సమర్పించారు.