శనివారం, 22 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 22 నవంబరు 2025 (11:39 IST)

బేగంపేట ఎయిర్‌పోర్టులో మహిళా పైలెట్‌పై అత్యాచారం

rape demo
హైదరాబాద్ నగరంలోని బేగంపేట విమానాశ్రయంలో ఓ మహిళా పైలెట్‌పై అత్యాచారం జరిగింది. సాటి పైలెట్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆ తర్వాత ఈ కేసును బెంగుళూరు హలసూరు పోలీస్ స్టేషనుకు బదిలీ చేశారు. 
 
బేగంపేటలోని ఓ ఏవియేషన్ సంస్థలో 26 యేళ్ల యువతితో పాటు రోహిత్ శరణ్ (60) అనే వ్యక్తి కమర్షియల్ పైలెట్లుగా పని చేస్తున్నారు. ఇటీవల సంస్థకు చెందిన ఓ పని నిమిత్తం ఆమెతో పాటు ఆయన కూడా బెంగుళూరుకు వెళ్లారు. అక్కడ హోటల్ గదిలో ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 
 
అయితే ఆ యువతి ప్రతిఘటించి అతని నుంచి తప్పించుకుని హైదరాబాద్ నగరానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ కేసు బెంగుళూరు హలసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో అక్కడకు బదిలీ చేశారు. బాధితురాలిని పోలీసులు ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు.