గురువారం, 10 అక్టోబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 మే 2023 (10:39 IST)

ధోనీ చేతులారా షర్ట్‌పై ఆటోగ్రాఫ్ వేయించుకున్న గవాస్కర్

Dhoni_Gavaskar
Dhoni_Gavaskar
ఐపీఎల్‌లో భాగంగా మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ సొంతగడ్డపై పరాజయం పాలైంది. అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన కోల్ కతా నైట్ రైడర్స్ ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చెన్నైసూపర్ కింగ్స్ జట్టు అభిమానుల థ్యాంక్స్ గివింగ్ ఈవెంట్‌లో ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్న గవాస్కర్ భావోద్వేగంతో మాట్లాడాడు.
 
ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో నిన్న చెన్నైలోని చెపాక్కంలో సీఎస్‌కే-కోల్‌కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించింది. చెన్నై జట్టుకు తమ సొంత మైదానంలో ఇదే చివరి లీగ్ మ్యాచ్ కావడంతో అభిమానులకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అందరికంటే ముందు మొదటి వ్యక్తిగా CSK కెప్టెన్ ధోని వద్దకు పరిగెత్తి అతని ఆటోగ్రాఫ్ పొందాడు. అది కూడా ఆయన షర్ట్‌పై ఆటోగ్రాఫ్ వేసుకున్నాడు.
 
ఈ సందర్భంగా గవాస్కర్ మాట్లాడుతూ.. 'ధోని లాంటి ఆటగాడు వందేళ్లకు ఒకసారి వస్తాడు. అందుకే ఆయన ఆటను కొనసాగించాలని అందరూ కోరుకుంటున్నారు. ఇది ధోనీకి చివరి సీజన్ కాకూడదని కూడా కోరుకుంటున్నాను. మరికొంత కాలం ఆడాలని ఆకాంక్షించాడు.