1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 24 మే 2023 (20:06 IST)

ఇది నా చివరి ఐపీఎల్ అంటూ మీరే డిసైడ్ చేసేశారా? ధోనీ ప్రశ్న

Dhoni
చెన్నై సూపర్ కింగ్స్ పేరు చెబితే మహేంద్ర సింగ్ ధోనీనే గుర్తుకొస్తాడు. సీఎస్కే అంటే ధోనీ అన్నట్లు ఐపీఎల్ క్రీడలో మారింది. అలాగే ధోనీ బ్యాచ్ వరుసగా 10 సీజన్లలో ఫైనల్లోకి రావడం ఆసక్తికరం. ఇదిలావుంటే ధోనీ రిటైర్మెంట్ గురించి జోరుగా చర్చ జరుగుతోంది.
 
ఐపీఎల్ లీగ్ దశలో టాస్ వేసేటపుడు... మీ చివరి సీజన్ ను ఆస్వాదిస్తున్నారా అంటూ ధోనీతో కామెంటేటర్ డానీ అన్నారు. ఆ సమయంలో ధోనీ మాట్లాడుతూ... ఇది నా చివరి ఐపీఎల్ అని మీరే డిసైడ్ చేసేసారా అంటూ నవ్వుతూ కౌంటర్ ఇచ్చాడు.
 
సీఎస్కే జట్టు కోసం ధోనీ వచ్చే ఏడాది కూడా ఆడుతాడంటూ కొందరు వ్యాఖ్యానిస్తుండగా మరికొందరు ధోనీ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఎవ్వరికీ తెలియదని మరికొందరు అంటున్నారు. మొత్తమ్మీద ధోనీ రిటైర్మెంట్ గురించి మరోసారి జోరుగా చర్చ జరుగుతుంది. మరి ఐపీఎల్ ఫైనల్ పోరు ముగిసాక ధోనీ ఏం చెపుతాడో చూడాలి.