గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 మే 2023 (15:56 IST)

ఇంటి దారి పట్టిన బెంగళూరు.. ఏకిపారేసిన లక్నో టీమ్

kohli
ఐపీఎల్ 2023లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఇంటి దారి పట్టింది. దీంతో లక్నో టీమ్ పండగ చేసుకుంటోంది. ఇప్పటికే ఈ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లక్నో టీమ్ కూడా కోహ్లీకి పరోక్షంగా చురకలంటించింది. 
 
సెంచరీ చేసి ఆర్సీబీని ఓడించిన గుజరాత్ ఆటగాడు గిల్ ఫొటోనే షేర్ చేసి.. "ప్రిన్స్? అతను ఇప్పటికే కింగ్ అని కామెంట్ చేసింది. కోహ్లీని అభిమానులు కింగ్ అని పిలుస్తుంటారనే సంగతి తెలిసిందే. ఈ పోస్టుపై కోహ్లీ అభిమానులు మళ్లీ ట్రోలింగ్ ప్రారంభించారు. లక్నో టీమ్‌‌, గౌతమ్‌ను కూడా ఏకి పారేస్తున్నారు.