బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 10 మే 2023 (23:10 IST)

సహజసిద్ధంగా శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను ఎలా తగ్గించుకోవచ్చు?

amla
యూరిక్ యాసిడ్. ఈ రోజుల్లో ప్రతి రెండవ వ్యక్తి అధిక యూరిక్ యాసిడ్‌తో ఇబ్బంది పడుతున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. ఈ సమస్యకు సకాలంలో చికిత్స చేయకపోతే ఇది తీవ్రమైన సమస్యగా మారే అవకాశం వుంటుంది. కీళ్లనొప్పులు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం వుంటుంది. ఈ సమస్యను ఎలా నిరోధించాలో తెలుసుకుందాము.
 
యూరిక్ యాసిడ్ అదుపు చేసేందుకు ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా కలిపి తీసుకోవాలి. శరీరంలో యూరిక్ యాసిడ్ మొత్తాన్ని తగ్గించడానికి, ప్రతిరోజూ ఆహారంలో విటమిన్ సి తీసుకుంటూ వుండాలి. నారింజ, ఉసిరికాయల్లో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది కనుక వాటిని తీసుకుంటూ వుండాలి.
 
ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరంలోని యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా, డైటరీ ఫైబర్ రక్తం నుండి యూరిక్ యాసిడ్‌ను గ్రహించి మూత్రపిండాల ద్వారా బయటకు పంపుతుంది. వంట కోసం వెన్న లేదా వెజిటబుల్ ఆయిల్‌కి బదులుగా కోల్డ్ ప్రెస్డ్ ఆలివ్ ఆయిల్ ఉపయోగించాలి.
 
యూరిక్ యాసిడ్ తగ్గించడానికి, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలకు దూరంగా ఉండాలి. ఇవి చేపలు, దాని నూనెలలో వుంటాయి. అధిక యూరిక్ యాసిడ్ చేర్చే సంతృప్త కొవ్వులు, కేకులు, పేస్ట్రీలు, కుకీలు మొదలైన వాటిని దూరంగా వుంచండి.