1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 3 మే 2023 (17:35 IST)

పెరుగుతో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చా?

చాలా మందికి జట్టు అకారణంగా రాలిపోతుంది. ఇక డెండ్రాఫ్ (చుండ్రు) సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అన్ని వయసుల వారిలో ఉంటుంది. ఇలాంటి సమస్యలకు పెరుగుతో చెక్ పెట్టొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పెరుగు ఆరగిస్తే చలువదనం. పైగా బాగా నిద్రపడుతుంది కూడా. అలాంటి పెరుగుతో జుట్టును ఏ విధంగా సంరక్షించుకోవచ్చో తెలుసుకుందాం.
 
కప్పు పెరుగు తీసుకుని అందులో నాలుగు స్పూన్ల నిమ్మరసంతో పాటు నాలుగైదు చుక్కల కొబ్బరి నూనె వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి జుట్టు కుదుళ్లకు పట్టేట్లు పట్టించాలి. 20 నిమిషాల పాటు ఆరబెట్టి కడిగేయాలి. దీని వల్ల జుట్టు వత్తుగా పెరగటంతో పాటు చుండ్రు సమస్య తగ్గిపోతుంది.
 
కప్పు పెరుగులో కోడిగుడ్డు సొన వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత జుట్టుకు పట్టించాలి. అరగంట పాటు అలానే వదిలేశాక.. చన్నీళ్లతో జుట్టును శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల జుట్టులో మెరుపు వస్తుంది. ఆరోగ్యమైన జుట్టు మీ సొంతం అవుతుంది. 
 
కప్పు పెరుగులోకి బాగా పండిన అరటిపండును కట్ చేసి వేసిన తర్వాత మిశ్రమాన్ని మెత్తగా కలపాలి. దీనికి నాలుగైదు చుక్కల ఆలివ్ నూనెను జతచేయాలి. జుట్టుకు పట్టించి వైడ్ టూత్ దువ్వెనతో దువ్వుకోవాలి. ఈ మిశ్రమం జుట్టుకు పట్టేంత వరకూ ఆరబెట్టుకోవాలి. కనీసం అరగంట అలా ఉంచుకోవాలి. ఇలా చేస్తే వెంట్రుకలు ఊడిపోయే సమస్య ఉండదు. మరింత గట్టిగా కుదుళ్లు ఉంటాయి.
 
కప్పు పెరుగుతోకి టేబుల్ స్పూన్ తేనె కలపాలి. దీనికి కొద్దిగా యాపిల్ సిడార్ వెనిగర్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత జుట్టుకు పట్టించి షాంపూతో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల జుట్టు గట్టిగా ఉంటుంది.
 
కప్పు పెరుగులోకి రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్‌ను వేయాలి. మిశ్రమంగా కలిపిన తర్వాత ఆ పేస్టును జుట్టు కుదుళ్లు తగిలేవరకూ పట్టిస్తే ఇచ్చింగ్ సమస్యరాదు. దీనికితోడు జుట్టు పెరుగుతుంది.