శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 1 మే 2023 (23:47 IST)

జామ పండు, జామ ఆకులతో 8 ఆరోగ్య ప్రయోజనాలు

guava tree leaf
జామకాయ. ఈ పండ్లను రోడ్ల వెంట చిరు వ్యాపారులు అమ్ముతూ కనిపిస్తుంటారు. ఏదో తక్కువ ధరే కదా అనుకుంటాము కానీ ఇందులో వుండే పోషకాలు అమోఘం. జామకాయ చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. జామకాయ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. శరీరంలో క్యాన్సర్ అభివృద్ధి ప్రమాదాన్ని జామకాయ తింటే తగ్గించవచ్చని చెపుతారు.
 
రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. జామపండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మలబద్ధకం సమస్య నుంచి జామకాయలు బయటపడేస్తాయి. మెరుగైన కంటిచూపులో జామకాయలు ఎంతగానో సహాయపడుతాయి. గర్భధారణ సమయంలో జామ స్త్రీలకు సహాయపడుతుంది.