గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 మే 2023 (20:01 IST)

సిరాజ్ ఇంట్లో పార్టీ.. విరాట్ కోహ్లీతో పాటు టీమ్ మొత్తం హాజరు

mohammed siraj
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా తమ తదుపరి మ్యాచ్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్ హైదరాబాద్‌కు చేరుకుంది. మే 18న ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ క్రమంలో లోకల్ ప్లేయర్, ఆర్‌సీబీ స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్.. తన టీమ్‌కు ఆతిథ్యం ఇచ్చాడు. కొత్తగా నిర్మించిన తన ఇంటికి ఆర్‌సీబీ టీమ్ మొత్తాన్ని డిన్నర్‌కు ఆహ్వానించాడు. 
 
విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌తో సహా పలువురు ఆర్‌సీబీ ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్‌తో పాటు సిరాజ్ ఇంట పార్టీకి హాజరయ్యారు. మహమ్మద్ సిరాజ్ తన నూతన నివాసాన్ని ఫిల్మ్ నగర్‌లో నిర్మించుకున్నట్లు తెలుస్తోంది.

సిరాజ్ ఇంటివద్ద ఆర్‌సీబీ ఆటగాళ్ల సందడిని వీడియో తీసిన ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో వైరల్‌గా మారింది.