సోమవారం, 7 అక్టోబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 మే 2023 (10:16 IST)

ఐపీఎల్‌ 2023: రషీద్ ఖాన్ సిక్సర్ల మోత.. రికార్డుల పంట

Rashid Khan
Rashid Khan
ఐపీఎల్‌లో భాగంగా గత రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ ఈ మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఇంకా రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసుకోవడంతోపాటు అర్ధ సెంచరీ సాధించిన ఐదో ఆటగాడిగా మరికొందరితో కలిసి రికార్డు పంచుకున్నాడు. 
 
సూర్యకుమార్ యాదవ్ సెంచరీ (49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 పరుగులు)తో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 5 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం భారీ విజయ లక్ష్యాన్ని చేధించే క్రమంలో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేసింది.