సోమవారం, 25 సెప్టెంబరు 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 మే 2023 (12:00 IST)

బాదుడే బాదుడు.. ఐపీఎల్‌లో తొలి సెంచరీ.. శుభ్‌మన్ గిల్ అదుర్స్

Gill
Gill
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సత్తా చాటాడు. తన తొలి ఐపిఎల్ సెంచరీతో చెలరేగాడు. గుజరాత్ టైటాన్స్ కోసం శుభ్‌మన్ గిల్ ఐపిఎల్ 2023లో తొలి సెంచరీ, 500-పరుగుల మార్క్‌ను దాటాడు. 
 
అహ్మదాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపిఎల్‌లో తొలి సెంచరీని సాధించడం ద్వారా తాను  ఫుల్ ఫామ్‌లో వున్నట్లు నిరూపించాడు. గిల్ కేవలం 56 బంతుల్లో సెంచరీ మార్కును చేరుకున్నాడు. కేవలం 22 బంతుల్లోనే 50 పరుగుల మార్కును చేరుకున్నాడు.
 
మరో ఎండ్‌లో వికెట్లు పడిపోయినప్పటికీ తన కూల్‌గా ఉండి కేవలం 56 బంతుల్లో ట్రిపుల్ ఫిగర్ మార్క్‌ను చేరుకున్నాడు. తద్వారా ఐపీఎల్ 2023లో అతను 500 పరుగుల మార్క్‌ను అధిగమించాడు.