స్పైడర్‌మ్యాన్‌కి వాయిస్ ఇస్తోన్న క్రికెటర్ శుభ్‌మన్ గిల్!! (video)
స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్ సినిమాపై ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఆ సినిమాపై ఆసక్తి పెరిగింది. 2021లో స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్పైడర్ మ్యాన్ మళ్లీ సినీ విశ్వంలోకి తిరిగి రావాలని అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. 2023 జూన్ 2న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో స్పైడర్ మ్యాన్ హిందీ, పంజాబ్ వెర్షన్‌లలో క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ వాయిస్ వుంటుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ భాషల్లో మాత్రమే జూన్ 2న ఈ సినిమా విడుదల అవుతుంది.
భారతీయ స్పైడర్-మ్యాన్ పవిత్ర్ ప్రభాకర్‌కు శుభ్‌మాన్ గిల్ వాయిస్ ఇస్తున్నారు. ఈ వాయిస్ పవిత్ర్ ప్రభాకర్ పాత్రను భారతీయ ప్రేక్షకులకు మరింత ప్రత్యేకంగా, చేరువగా చేస్తుంది. తన బ్యాటింగ్ నైపుణ్యంతో, గిల్ క్రికెట్ అభిమానులను ఇప్పటికే బాగా ఆకర్షించాడు
తాజాగా ఈ 'స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్'లో పవిత్ర్ ప్రభాకర్‌కు గాత్రం ఇవ్వడం ద్వారా సినీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. స్పైడర్ మ్యాన్ తన ఫేవరెట్ సూపర్ హీరో అని ఒప్పుకున్న శుభమాన్ గిల్, స్పైడర్ మ్యాన్ విశ్వంలోకి అడుగుపెట్టేందుకు తాను ఎంతో సంతోషంగా వున్నానని వెల్లడించాడు.
స్పైడర్ మ్యాన్ అతిపెద్ద హాలీవుడ్ ఫ్రాంచైజీలలో చోటు దక్కించుకోవడం పట్ల గిల్ హర్షం వ్యక్తం చేశాడు.
ఇండియన్ స్పైడర్ మ్యాన్‌కి తన గాత్రాన్ని అందించడం గురించి శుభ్ మాన్ గిల్ మాట్లాడుతూ, "నేను స్పైడర్ మ్యాన్‌ని చూస్తూ పెరిగాను, అతను చాలా సాపేక్షమైన సూపర్ హీరోలలో ఒకడు. ఈ చిత్రం ఇండియన్ స్పైడర్ మ్యాన్‌తో పరిచయం అవుతుంది కాబట్టి. హిందీ, పంజాబీ భాషల్లో తొలిసారిగా మన ఇండియన్ స్పైడర్ మ్యాన్ పవిత్ర్ ప్రభాకర్‌కి గాత్రదానం చేయడం నాకు చాలా గొప్ప అనుభూతిని కలిగించింది. ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను." అంటూ వెల్లడించారు.
సోనీ పిక్చర్స్ రిలీజ్ ఇంటర్నేషనల్ (SPRI) ఇండియా జనరల్ మేనేజర్ షోనీ పంజకరన్ మాట్లాడుతూ.. "జూన్ 2 నిజానికి దేశవ్యాప్తంగా ఉన్న స్పైడర్ మ్యాన్ అభిమానులందరికీ గుడ్ డే. 'స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్'లో చేసినట్లే ఈ చిత్రానికి కలిసి పనిచేయడం హ్యాపీగా వుంది.
అలాగే శుభ్‌మాన్ గిల్‌తో కలిసి పని చేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. అతను యూత్ ఐకాన్ మాత్రమే కాదు, నిజమైన హీరో కూడా, అంతర్జాతీయ క్రికెట్‌లో మన దేశానికి బాగా ప్రాతినిధ్యం వహించాడు, అదే సమయంలో అతని మైదానంలో హీరోయిక్స్‌తో మిలియన్ల మంది అభిమానులను ఆకర్షిస్తున్నాడు... అంటూ పంజకరన్ వెల్లడించారు.