సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 3 మే 2023 (16:51 IST)

ఈ స్థానంలో నిలబెట్టింది అభిమానులే.. వాళ్లకు థ్యాంక్స్ : రకుల్ ప్రీత్ సింగ్

Rakul
తనను ఈ స్థానంలో నిలబెట్టింది అభిమానులేనని, వాళ్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పారు. ఆమె తాజాగా మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి సినిమాలు చూడటమే గానీ, వాటిలో నటిస్తానని కలలో కూడా ఊహించలేదన్నారు. అది కూడా హిందీ చిత్రాలే చూసేదాన్నని తెలిపారు. 
 
తనకు 18 యేళ్లు ఉన్న సమయంలో మోడలింగ్‌లోకి అడుగుపెట్టాని, ఒక్క నెల తిరిగేసరికి నా ఫోటోలు ఎవరో చూసి నేరుగా మా డాడీకి ఫోన్ చేసి సినిమాలో నటింపజేసేందుకు సంప్రదించారని తెలిపారు. వాళ్ళు పదేపదే అడగటంతో ఓకే చెప్పారని తెలిపారు. పైగా, కేవలం ప్యాకెట్ మనీ కోసమే సినిమాల్లో నటించాలని, మా స్నేహితుల్లో కంటే నేను బిజీ పర్సన్ కావాలన్న ఉద్దేశ్యంతో ఈ రంగంలోకి అడుగుపెట్టినట్టు చెప్పారు. ఆ తర్వాత అభిమానులు ఆదరించడంతో తాను ఈ స్థాయికి చేరుకున్నానని, వాళ్లందరికీ థ్యాంక్స్ చెబుతున్నట్టు వెల్లడించారు.
 
కాగా, రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో నటించిన తొలి చిత్రం "వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్". ఇది బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించడంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు. ఇపుడు బాలీవుడ్‌లోనూ హవా కొనసాగిస్తుంది. ఈమెకు సోషల్ మీడియాలో కూడా అభిమానులు అధిక సంఖ్యలోనే ఉన్నారు.