సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2023 (11:20 IST)

సింగర్ సునీత భర్తకు బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు

Sunitha
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ సింగర్ సునీత భర్త రామ్‌కు లక్ష్మణ్ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ రామ్ తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొన్ని రోజుల క్రితం లక్ష్మణ్ అనే వ్యక్తి ఫోన్ నుంచి రామ్‌కు ఓ మెసేజ్ వచ్చింది. తాన సినీ నిర్మాతల కౌన్సిల్ సభ్యుడిని, వ్యక్తిగతంగా వచ్చి కలవాలంటూ అందులో పేర్కొన్నారు. అయితే, సదరు వ్యక్తి తనకు తెలియకపోవడంతో రామ్ స్పందించలేదు. ఏదైనా బిజినెస్ విషయం అయితే, తన జట్టును కలవాలంటూ రిప్లై ఇచ్చాడు. 
 
కానీ ఆ వ్యక్తి మాత్రం వ్యక్తిగతంగా కలవాలంటూ మెసేజ్‌లు పంపుతూ విసిగించసాగాడు. దీంతో ఆ నంబర్‌ను రామ్ బ్లాక్ చేశాడు. అప్పటికీ వదిలిపెట్టని లక్ష్మణ్ మరో నంబరుతో మార్చి 28వ తేదీన నుంచి మెసేజ్‌లు పంపించసాగాడు. పైగా, బెదిరింపులకు కూడా పాల్పడసాగాడు. దీంతో సునీత భర్త రామ్ తనకు, తన కుటుంబ సభ్యులకు లక్ష్మణ్ నుంచి ప్రాణహాని ఉందంటూ హైదరాబాద్ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ దంపతులు ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఉమెన్స్ కోఆపరేటివ్ సొసైటీలో నివాసం ఉంటున్నారు.