1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2023 (09:34 IST)

కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టి.. చరిత్ర సృష్టించిన శుభమన్ గిల్

subhman gill
భారత యువ క్రికెటర్ శుభమన్ గిల్ నయా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత క్రికెట్ జట్టు తరపున మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన ఐదో ఆటగాడిగా, ఈ అరుదైన రికార్డును సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రలో నిలిచాడు. అతని కంటే ముందు సురేశ్ రైనా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు ఉన్నారు.
 
అంతేకాకుండా, పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో శుభమన్ గిల్ సెంచరీ బాదాడు. మొత్తం 63 బంతుల్లో 12 ఫోర్లు, ఏడు సిక్స్‌ల సాయంతో 126 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది వరకు ఆసియా కప్‌లో 54 బంతుల్లో పది ఫోర్లు, ఐదు సిక్స్‌ల సాయంతో తొలి శతకాన్ని నమోదు చేసిన గిల్.. అప్పటివరకు ఉన్న విరాట్ కోహ్లీ రికార్డులను బ్రేక్ చేశాడు. 
 
అలాగే, టీ20ల్లో సెంచరీ చేసిన యువ క్రికెటర్‌గా కూడా గిల్ తన పేరును లిఖించుకున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలు, టీ20ల్లో అత్యధిక స్కోరు (208పరుగులు, 126 నాటౌట్) చేసిన ఆటగాడిగానూ గిల్ నిలిచాడు. అంతేకాకుండా, భారత క్రికెట్ జట్టు తరపున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆడగాడిగా గిల్ రికార్డుకెక్కాడు. ఇది ఇప్పటివరకు విరాట్ కోహ్లీ పేరుమీద ఉండేది.