సచిన్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ... 110 బంతుల్లో 166 పరుగులు
శ్రీలంకతో వన్డే సిరీస్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. తొలి వన్డేలో సెంచరీ సాధించిన కోహ్లీ... ప్రస్తుతం మూడో వన్డేలోనూ శతక్కొట్టాడు. 85 బంతుల్లో సెంచరీ సాధించాడు కోహ్లీ. అంతేకాకుండా సెంచరీ చేశాక లంక బౌలర్లపై సెంచరీ సాధించాడు.
ఫలితంగా 110 బంతుల్లో 166 పరుగులతో అజేయంగా నిలిచాడు. అందులో 13 ఫోర్లు, 8 సిక్సులు వున్నాయి. ఈ శతకంతో కోహ్లీ ఒక అరుదైన ఘనత సాధించాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు.
స్వదేశంలో కోహ్లీకి ఇది 21వ సెంచరీ. దీంతో.. స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ సచిన్ పేరిట ఉండేది. ఆయన స్వదేశంలో 20 సెంచరీలు నమోదు చేశాడు. ఇప్పుడు కోహ్లీ 21వ సెంచరీలతో ఆ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు.