శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 జనవరి 2023 (20:06 IST)

900 కిలోమీటర్ల దూరంలో వున్న కవలలు.. కొన్ని గంటల వ్యవధిలో మృతి.. ఎలా?

రాజస్థాన్‌లో 900 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న కవలలు కొన్ని గంటల వ్యవధిలో మరణించడం కలకలం రేపింది. 26 ఏళ్ల కవలలు కొన్ని గంటల వ్యవధిలో మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. దురదృష్టకరమైన ఈ విచిత్రమైన సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లో ఒకే రోజు 26 ఏళ్ల కవలలు ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ ఒకరికొకరు 900 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్నారు. ఒకరు బార్మర్‌లో, ఒకరు సూరత్‌లో నివసించినట్లు పోలీసులు చెప్తున్నారు.
 
వీరిద్దరూ ఒకరు తన ఇంటి డాబా నుంచి జారిపడగా, మరొకరు వాటర్ ట్యాంక్‌లోకి జారిపడిపోయారు. కవలలు, సోహన్ సింగ్, సుమేర్ సింగ్‌లను వారి స్వగ్రామమైన సార్నోకాతాలాలో ఒకే చితిపై దహనం చేశారు. సుమేర్ గుజరాత్‌లోని టెక్స్‌టైల్ సిటీలో పనిచేస్తున్నాడు, సోహన్ జైపూర్‌లో సెకండరీ గ్రేడ్ టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు చదువుతున్నాడు.
 
ఒకరు తన ఇంటి డాబా నుంచి జారిపడగా, ఇద్దరిలో పెద్ద సోహన్ తన ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉన్న ట్యాంక్ నుండి నీరు తీసుకురావడానికి బయలుదేరాడు. అనంతరం ట్యాంక్‌లో పడిపోయి కనిపించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.