1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 12 అక్టోబరు 2022 (23:02 IST)

నయన్ పిల్లలకు అద్దె తల్లి ఎవరు? షాకింగ్ న్యూస్

Nayan-Vignesh
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
నటి నయనతార అద్దె తల్లి ద్వారా కవలలకు జన్మనివ్వడం సంచలనం సృష్టించింది. ఈ వివాదం వివిధ కోణాల్లో చర్చనీయాంశమైంది. నటి నయనతార అద్దె తల్లి ద్వారా బిడ్డలను కన్న ఆసుపత్రి, వైద్యులపై అందరి దృష్టి ఉంది.

 
నయనతార కవలలు చెన్నైలోని అతిపెద్ద ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్‌లో జన్మించారు. కేరళకు చెందిన నయన్ బంధువు అద్దె తల్లి అయినట్లు సమాచారం. ఆమె ఎవరూ, ఆమెకు నయనతారతో ఎలాంటి సంబంధం ఉందో తెలియాల్సి వుంది.

nayanthara - vignesh shivan
సరోగేట్ మదర్ కావడానికి ఆ మహిళకు అన్ని అర్హతలు ఉన్నాయని వైద్యులు ధృవీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం విఘ్నేష్ శివన్, నయనతారల పిల్లలపై చర్చ సాగుతోంది.