మంగళవారం, 23 జులై 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 జనవరి 2023 (12:13 IST)

విరాట్ కోహ్లీ కొత్త అవతారం... ర్యాప్ సాంగ్‌లో స్టెప్పులు

kohli
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కొత్త అవతారం ఎత్తనున్నాడు. రాపర్లు డివైన్, జోనితా గాంధీచే 'నయా షేర్' అనే ర్యాప్ సాంగ్‌లో తాను కనిపిస్తానని విరాట్ కోహ్లీ చెప్పాడు. రాయల్ ఛాలెంజ్ కోసం విరాట్ కోహ్లీ ర్యాప్ సాంగ్‌లో కనిపించనున్నాడు. ఈ సాంగ్ కోసం విరాట్ కోహ్లీ డ్యాన్స్ అదరగొట్టాడు. 
 
ఈ సందర్భంగా విరాట్ కోహ్లి మాట్లాడుతూ, "నేను ఎప్పుడూ ఫీల్డ్‌లో లేదా బయట ధైర్యంగా వుంటాను. నేను ఎలా ఉంటానో అదే వైఖరిని కొనసాగిస్తున్నాను" అని అన్నాడు. ధైర్యంగా ఎంపిక చేయడంతోనే అద్భుతంగా ఆడే కుర్రాళ్లు జట్టులో వున్నారని చెప్పకనే చెప్పాడు. రాయల్ ఛాలెంట్ కోసం పాటను చిత్రీకరించడం మంచి అనుభవం అంటూ కోహ్లీ తెలిపాడు.